Home Page SliderInternational

ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు! ఎక్కడో తెలుసా?

ప్రపంచంలో అనేక దేశాలలో రైలు మార్గాలు ఉన్నాయి. కానీ మనం చెప్పుకోబోయే ఈ అత్యంత నెమ్మదైన రైలు ఒక భయంకరమైన రైల్వే మార్గంలో నడుస్తోంది. స్విట్జర్లాండ్ లోని గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలుగా పేరుపొందింది. దీని వేగం గంటకు 24 మైళ్ళు మాత్రమే. ఈ రైలు ఎందుకు అత్యంత నెమ్మదిగా వెళుతుందంటే, ఇది జెర్మాట్ నుంచి సెయింట్ మెరిట్జ్ వెళ్లే మార్గం లో ఒక కొండపై నిర్మించిన 291 వంతెనలు, 91 సొరంగాలు దాటుకుంటూ వెళుతుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత నెమ్మదైన రైలు ప్రయాణ మార్గంగా నిలిచింది. దీని ప్రయాణ సమయం 8 గంటలు. ఈ 8 గంటలు ప్రయాణికులు ఒక్క క్షణం కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ప్రయాణిస్తారు. కారణం, అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు. దీనిని స్విట్జర్లాండ్ కాన్యన్ అని కూడా పిలుస్తారు. ఈ రైలులో ఆహార పానీయాలతో సహా అన్ని సదుపాయాలు లభిస్తాయి.