News

తెలంగాణ రైతు భరోసాపై కీలక అప్‌డేట్

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రైతు భరోసాపై కీలక అప్‌డేట్‌ను ఇచ్చింది. ఇప్పటి వరకూ రైతులకు ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విధివిధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 10 ఎకరాల లోపు భూమి ఉండే రైతులకు రైతు భరోసాను ఇవ్వాలని మేధావుల ప్రతిపాదనపై అంగీకరించినట్లు తెలుస్తోంది. కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయేతర భూములకు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరో 20 రోజులలో పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు చేస్తామని అధికార వర్గాలు పేర్కొన్నాయి.