Home Page SliderTelangana

అసెంబ్లీలో కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్

ఈ రోజు ప్రారంభమైన తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు బాగా హీటెక్కుతున్నాయి. కాగా అసెంబ్లీలో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించిందని తెలంగాణా యువత చెబితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కాగా దీనికి  మంత్రి సీతక్కగట్టి కౌంటర్ ఇచ్చారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తామని పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి తెలంగాణా ప్రజలను మోసం చేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు.కాగా ఆ పదేళ్లు ఓయూకు కూడా వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ లక్షలమంది పేదలు ఇళ్లు లేక బాధపడుతున్నారని సీతక్క తెలిపారు. గత పదేళ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమందికి ఇళ్లు ఇచ్చారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా మా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. దీంతో తెలంగాణా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయకపోతే..ప్రజలు ఎవరికైనా సరే బుద్ధి చెబుతారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.