Home Page SliderNational

విజయ్ సాలిడ్ ప్రాజెక్ట్‌లోకి భాగ్యశ్రీ బోర్స్ ఎంట్రీ

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” అనుకున్న రేంజ్‌లో సక్సెస్ అందుకోని సంగతి అందరికీ తెలిసిందే. తన 12వ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో విజయ్ లుక్ ఒకటి లీక్ అయ్యి ఇంటర్నెట్‌ని షేక్ చేసింది. మరోసారి విజయ్ దేవరకొండ సెన్సేషన్‌గా మారాడు.

ఈ చిత్రం మొదటి నుంచి హీరోయిన్ విషయంలో మంచి సస్పెన్స్ నడిచింది. ఫైనల్‌గా లేటెస్ట్ యంగ్ బ్యూటీ ఫిక్స్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ “మిస్టర్ బచ్చన్” సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. శ్రీలంకలో షూటింగ్ స్పాట్ నుంచి ఓ పిక్ రీసెంట్‌గా వైరల్‌ అయింది. విజయ్, భాగ్యశ్రీ క్రేజీ ప్రాజెక్ట్‌కు అనిరుధ్‌ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.