Andhra PradeshHome Page Slider

ఏపీలో ఉచిత ఇసుకపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఏపీలో నిన్నటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుకపై  ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీపై కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎస్పీ,జేసీ,వివిధ శాఖల అధికారులు ఉంటారని పేర్కొంది. కాగా ఇసుక లోడింగ్ ,రవాణా ఛార్జీల బాధ్యతలను జిల్లా కమిటీలే పర్యవేక్షిస్తాయని తెలిపింది. ఈ క్రమంలో ఇసుకను తిరిగి అమ్మినా,ఇతర రాష్ట్రాలకు తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.అంతేకాకుండా ఈ ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మాత్రమే వాడాలని ప్రభుత్వం వెల్లడించింది.