గ్రేటర్ హైదరాబాద్లో డెంగీ జ్వరాలు విజృంభణ!
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 900 డెంగీ జ్వరాల కేసులు నమోదవగా… ఇందులో అధికం భాగ్యనగరంలోనివే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వానాకాలం కావడంతో డెంగీకి కారణమయ్యే టైగర్ దోమ విజృంభిస్తోంది. టైగర్ దోమ కుట్టిన 3-4 రోజులకే వంటి నొప్పులతో మొదలై తీవ్రజ్వరం, తలనొప్పి వస్తోంది. రెండో దశలో బీపీ పడిపోవడం, ప్లేట్లెట్లు తగ్గడం, వాంతులు, కడుపునొప్పి, కాలేయంపై ప్రభావం కనిపిస్తుంది.

