Home Page SliderTelangana

హాస్టల్‌లో కేర్ టేకర్‌, ప్రిన్సిపల్ శైలజ కలిసి మద్యం కొడతారు..

టిజి: సూర్యాపేట జిల్లా బాలెంలో సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో కేర్ టేకర్‌తో కలిసి ప్రిన్సిపల్ శైలజ మద్యం తాగి, తమను వేధిస్తోందని ఆరోపించారు. ఆమె గదిలోని బీరువాలో బీర్ బాటిళ్లను మీడియాకు చూపించారు. తమ పేరెంట్స్‌ను కలవడానికి అనుమతించడం లేదని వాపోయారు. విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.