Home Page SliderTelangana

భారత్ రైస్‌కు మంచి డిమాండ్

నిర్మల్: పెరుగుతున్న బియ్యం ధరల నుంచి వెసులుబాటు కల్పించేందుకు  కేంద్రం ప్రవేశపెట్టిన భారత్ రైస్ అమ్మకాలు జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రయాణ ప్రాంగణం సమీపంలోని దుకాణంలో శుక్రవారం విక్రయాలను మొదలుపెట్టారు. 10 కిలోల బస్తా రూ.290 చొప్పున విక్రయించారు. మొదటి రోజే అయినా.. గిరాకీలు బాగున్నాయని దుకాణ యజమాని ఆమెడ శ్రీధర్ తెలిపారు. ఆధార్ కార్డు, ఫోన్ నంబరు వివరాల ఆధారంగా బస్తాలు పంపిణీ చేశారు. ముందుగా 300 బస్తాలు రాగా.. అవి మధ్యాహ్నానికి అమ్ముడుపోయాయి. బియ్యం మరీ సన్నగా, మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా ఉన్నాయని, బయటి రకాలతో పోలిస్తే నాణ్యంగా ఉన్నాయని, ఇవి పోషకాలతో కూడినవని దుకాణదారుడు తెలిపారు.