తుర్కియే అధ్యక్షుని కీలక వ్యాఖ్యలు..
భారత్‌లో బాయ్‌కాట్ తుర్కియే కొనసాగుతున్న వేళ తుర్కియే అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్‌కు తుర్కియే డ్రోన్లు అందించి సహాయం చేసింది. తాజాగా తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ మాట్లాడుతూ నిజమైన స్నేహానికి పాక్ నిదర్శనమని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను విలువైన మిత్రుడిగా అభివర్ణించాడు. అంతేకాదు భవిష్యతులో కూడా పాకిస్తాన్‌కు ఎప్పుడూ ఆపన్నహస్తం అందిస్తామంటూ భరోసా ఇచ్చాడు.