తెలంగాణలో పలు కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన, పాల్గొన్న సీఎం రేవంత్
దేశ వ్యాప్తంగా 56 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. 6 ప్రాజెక్టులను మోదీ వర్చ్యువల్‌గా ప్రారంభించారు. ఆదిలాబాద్‌లో కార్యక్రమానికి ప్రధానితోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. NTPC ప్లాంట్‌మను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. తెలంగాణలో కేంద్రం తీసుకొస్తున్న ప్రాజెక్టులతో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మద్దతు తప్పక ఉంటుందన్నారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధిని మరింతగా చేపడతామన్నారు. తెలంగాణలో ఇవాళ 6, 697 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అండర్ డ్రైనేజీ కాలువ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు. రేపు కూడా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుడతారు. 9,021 కోట్లతో చేపట్టే కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడాన్ని మోదీ అభినందించారు.

ఆర్థికంగా రాష్ట్రానికి అండగా నిలవాలని ప్రధాని మోదీని రేవంత్ కోరారు. కోరారు. మెట్రో ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో సిటీగా మారిందని… రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని రేవంత్ చెప్పారు. సబర్మతీలా, మూసీ నది అభివృద్ధికి చేయూత ఇవ్వాలన్నారు.
