Home Page SliderNational

కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. పంజాబ్‌లో అన్ని సీట్లకు ఆప్ పోటీ

పంజాబ్‌లోని మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని, అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. దీంతో ఇండియా కూటమికి మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాల నుంచి సహకారం లభించడం లేదు. మొన్న బెంగాల్ సీఎం మమత బెనర్జీ, నేడు పంజాబ్ లో ఆప్ పార్టీ ఎవరిదారి వారు చూసుకుంటామంటోండటంతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. దేశ వ్యాప్తంగా బీజేపీ దూకుడు ముందు నిలిచేలా కాంగ్రెస్ కన్పించడం లేదు.