పీటీఎం అక్రమాలు… పేమెంట్ సేవలు నిలిపేస్తున్న ఆర్బీఐ
ఇక ఫోన్ తీయడం.. పేటీఎం స్కాన్ చేయడం ఇక ఆపేయండి.. అవును ఈనెలాఖరు నుంచి ఇక పేటీఎం చేయడానికి వీల్లేదు. పేటీఎం బ్యాంక్ లిమిటెడ్ ద్వారా మనీ లాండరింగ్ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఆర్బీఐ ఉక్కుపాదం మోపింది. దీంతో Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై RBI పరిమితులు కస్టమర్లను ఎలా ప్రభావితం చేస్తాయన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్లు, టాప్-అప్‌లను ఆమోదించొద్దని… రిజర్వ్ బ్యాంక్ Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని ఆదేశించింది. ఒకరకంగా చెప్పాలంటే ఇక దుకాణం మూసుకోవాలని చెప్పేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… RBI గత వారం Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు లేదా కార్డ్‌లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని… క్రెడిట్ లావాదేవీలు నిర్వహించొద్దని ఆదేశించింది. Paytm వాలెట్ వినియోగదారులు తమ బ్యాలెన్స్ అయిపోయే వరకు తమ నిధులను ఉపయోగించుకోవచ్చంది. కానీ ఫిబ్రవరి 29 తర్వాత వారు డబ్బును జమచేయడం కుదరదని పేర్కొంది. RBI ఆలోచనలో ఎలాంటి మార్పు లేకుంటే… Paytm వాలెట్‌లకు టాప్-అప్‌లు నిలిచిపోతాయి. వాటి ద్వారా లావాదేవీలు ఇకపై జరగవు.

Paytm పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏమిటి?
ఇది మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం. Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్… OCLతో అనుబంధంగా ఉంది. OCL… పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిడెట్ PPBLలో 49 శాతం వాటాను కలిగి ఉంది. విజయ్ శేఖర్ శర్మకు బ్యాంకులో 51 శాతం వాటా ఉంది. PPBL మే 23, 2017న చెల్లింపుల బ్యాంక్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. సేవింగ్స్, కరెంట్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వాలెట్లు, UPI ఫాస్ట్‌ట్యాగ్‌తో సహా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. డిసెంబర్ 2023లో రూ. 8,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన 24.72 కోట్ల లావాదేవీలను నిర్వహించే వినియోగదారులతో, PPBLలో భాగమైన Paytm వాలెట్… ట్రాన్సెక్షన్లలో ఆధిపత్యం చెలాయించింది.

ఆర్బీఐ నిర్ణయం తర్వాత Paytm సేవలను ఉపయోగించగలమా?
ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను ఆమోదించకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను RBI ఆదేశం నిషేధిస్తుంది. అయితే, కస్టమర్‌లు తమ బ్యాలెన్స్‌లు అయిపోయే వరకు ఎలాంటి పరిమితులు లేకుండా ఉపసంహరించుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు. Paytm వాలెట్ వినియోగదారులు ఫిబ్రవరి 29 వరకు లావాదేవీలను కొనసాగించవచ్చు. కానీ ఆ తర్వాత డబ్బును మాత్రం ఎకౌంట్‌లో జమ చేయలేరు. ఇలాంటి నియమాలు PPBL ఖాతాలకు, FASTag, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వంటి అనుబంధ సేవలకు వర్తిస్తాయి.
ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా?
పేటీఎంపై నిషేధంతో ఇప్పుడు కష్టమర్లు వేటిని ఉపయోగించాలన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. Mobikwik, PhonePe, SBI, ICICI బ్యాంక్, HDFC, Amazon Payతో సహా పలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు వాలెట్ సేవలను అందిస్తున్నాయి. FASTag సేవల కోసం, కస్టమర్‌లు SBI, HDFC, ICICI, IDFC, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి 37 పైగా అధీకృత బ్యాంకులను ఎంచుకోవచ్చు.

అసలు పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు ఎందుకు పెట్టింది?
పేటీఎం బ్యాంక్ నిర్వహిస్తున్న అనేక ఖాతాలు కేవీసీ తీసుకోకపోవడం, పాన్ నెంబర్లు జత చేసి లేకపోవడంతోపాటుగా… పలు ఖాతాలకు ఒకే పాన్ నెంబర్ వినియోగించడం, మొత్తం తెరవెనుక మనీలాండరింగ్ జరుగుతుందన్న ఫిర్యాదులతో ఆర్బీఐ రంగప్రవేశం చేసింది. దీంతో పేటీఎం షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్థంగా ఉన్నాయన్న సమాచారంతో… Paytm స్టాక్ 10 శాతం క్షీణించాయి. ఫిబ్రవరి 5న లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. గత మూడు సెషన్‌లలో 42 శాతానికి పైగా పతనం కొనసాగింది. సోమవారం ఉదయం నాటికి రూ.761.4 నుండి రూ.438.5కి పడిపోయిన దాని పేమెంట్స్ బ్యాంక్ యూనిట్‌పై ఆర్‌బిఐ ఆంక్షలు విధించినప్పటి నుండి స్టాక్ వరుసగా లోయర్ సర్క్యూట్‌లో ట్రేడ్ అవుతోంది.

Paytm ప్రతిస్పందన ఏమిటి?
జనవరి 31, 2024న విధించిన Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన కఠినమైన నిషేధానికి Paytm వాలెట్ వ్యాపారం బహుశా మొదటి బాధితుడని చెప్పాల్సి ఉంటుంది. వాలెట్ల వ్యాపారాన్ని విక్రయించడానికి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి ముందున్న ఆప్షన్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తామ ఎలాంటి తప్పు చేయలేదని… మనీలాండరింగ్ నిరోధక కార్యకలాపాలకు సంబంధించి కంపెనీగానీ, దాని అసోసియేట్‌లు లేదా వ్యవస్థాపకుడు, CEOపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటువంటి దర్యాప్తు చేయలేదని Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ స్పష్టం చేస్తోంది. ఆర్బీఐ,ప్రభుత్వ సంస్థల విచారణకు హాజరవుతామని… ఎల్లప్పుడూ అధికారులకు సహకరిస్తామని పేర్కొంది. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని… కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తామంది. పేటీఎం బ్యాంక్‌తో సంబంధం లేని లోన్ పంపిణీ, బీమా పంపిణీ, ఈక్విటీ బ్రోకింగ్ వంటి ఆర్థిక సేవలు ప్రభావితం కావని హామీ ఇచ్చింది.

