హైదరాబాద్‌లో చలి తగ్గుతోంది… వేడి మొదలవుతోంది..!
భారత వాతావరణ విభాగం ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేయడం.. అందుకు తగినట్టుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం జరిగిపోతోంది. అప్పుడే ఎండాకాలం వచ్చేసిందా అన్నట్టుగా వాతావరణం మారుతోంది. IMD-హైదరాబాద్‌లోని శాస్త్రవేత్త డాక్టర్ ఎ శ్రావణి ప్రకారం, రాబోయే ఐదు రోజులు సాధారణ స్థితికి రావడానికి ముందు హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు.

అయితే, ఫిబ్రవరి మధ్య తర్వాత, ఉష్ణోగ్రతలలో స్థిరమైన పెరుగుదల కన్పిస్తోందన్నారు. బుధవారం, చందానగర్‌లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల C నమోదైంది. చలికాలం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. అమీర్‌పేట్‌లో పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. గరిష్టంగా 34.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాబోయే ఐదు రోజులలో IMD-హైదరాబాద్ పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తోంది.

పగటి పూట ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ.. రాత్రిలు సౌకర్యవంతంగా ఉండవచ్చని అభిప్రాయుపడుతోంది. బుధవారం రాజేంద్రనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 12.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మల్కాజిగిరిలో కనిష్ట ఉష్ణోగ్రత 13.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పగటిపూట వెచ్చదనం ఉన్నప్పటికీ, నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజుల్లో 17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. తెల్లవారుజామున పొగమంచుకు అకాశముందని IMD-హైదరాబాద్ అంచనా వేస్తోంది.

