Home Page SliderNational

“అందుకే ప్రభాస్‌ని డార్లింగ్ అంటారు”:సలార్ విలన్

ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ “సలార్‌” సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కేజీయఫ్-1,2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్” సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వూలో విలన్ పృథ్వీరాజ్ హీరో ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సలార్‌లో ప్రభాస్ దేవా పాత్రలో కన్పించనున్నారు. నేను వరదరాజ మన్నర్‌గా కనిపిస్తాను. అయితే నేను నా కెరీర్‌లో ఇప్పటివరకు సలార్ లాంటి స్ర్కిప్ట్ చూడలేదన్నారు. ఈ సినిమాలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కాగా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మా అందరికీ పూర్తి నమ్మకముంది అన్నారు. ఇక ఈ సినిమా హీరో  ప్రభాస్ గురించి చెప్పాలంటే ఆయనను ఇష్టపడనివారు ఎవరు ఉండరన్నారు. ఎందుకంటే నాకు చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారు. వారిలో నేను తరచూ మాట్లాడే వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరు అన్నారు. కాగా ప్రభాస్ సెట్‌లో ఉన్న అందరినీ బాగా చూసుకుంటారన్నారు. ప్రతిరోజు అందరి కోసం భోజనం తెప్పిస్తారు.తన చుట్టూ ఉండేవాళ్లు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకుంటారు. అయితే ప్రభాస్ అభిమానులు ఆయనను డార్లింగ్ అని ఎందుకంటారో నాకు షూటింగ్ సమయంలోనే అర్థమైందని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు.