‘తగ్గేదేలే’ అంటున్న రేవంత్ రెడ్డి
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచే సత్తా చాటుతూ మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్,కామారెడ్డిలో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో 6,416 ఓట్ల ఆధిక్యం సాధించినట్లు తెలుస్తోంది. అయితే కామారెడ్డిలోను రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు.మరోవైపు జడ్చర్ల,దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థులు అనిరుధ్ రెడ్డి ,మధుసూదన్ రెడ్డి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ 3897 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. దీంతో తెలంగాణాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలకు సన్నాహాలు చేస్తున్నారు.

