BRS పార్టీకి ఆర్టీసీ భూములపై కన్ను: బండి సంజయ్
పటాన్‌చెరు: రాష్ట్రంలో ఆర్టీసీ భూములను 99 ఏళ్ల లీజుతో కేసీఆర్ తన కుటుంబసభ్యుల పేర్ల మీద మార్చుకోడానికి పత్రాలను సిద్ధంచేసి ఉంచారని, పొరపాటున బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే అవన్నీ వారే లాక్కుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ఆరోపించారు. గురువారం తాను పోటీ చేస్తున్న కరీంనగర్‌లోని మొగ్దుంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ ప్రసంగించారు. పేదల బాధలు తెలుస్తాయనే బీసీకి సీఎం పదవి ఇవ్వాలని బీజేపీ సంకల్పించింది.

