అయ్యో దారుణం.. ఘోరం.. కుటుంబాన్ని కాల్చి చంపేసిన హెడ్ కానిస్టేబుల్
కడప జిల్లాలో ఘోరం జరిగింది. కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు జీవితంలో అతిపెద్ద ఘోరానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్న వెంకటేశ్వర్లు.. భార్య, ఇద్దరు బిడ్డలను అత్యంత కర్కశంగా కాల్చి చంపేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కష్టాలు కన్నీళ్లు ఎవరికైనా వచ్చేవి. సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ వెంకటేశ్వర్లు చేసిన దారుణం ఊహించడానికే కష్టంగా ఉంది. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ వెంకటేశ్వర్లు క్షణికావేశంతోనే ఇలా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

