జాబ్ నోటిఫికేషన్ రద్దు చేసిన ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ గతంలో విడుదల చేసిన ఓ జాబ్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. కాగా రాష్ట్ర సర్వే సంస్థకు చెందిన కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-2 జాబ్ నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 17న ఈ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ జారీ చేసి..దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే తాజాగా సాంకేతిక విద్యర్హతను నోటిఫికేషన్‌లో అదనంగా చేర్చాలని నిర్ణయించారు. దీంతో ఏపీపీఎస్సీ ఈ బాజ్ నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే విధుల నిర్వహణ జాబితాలోనూ మార్పులు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఈ మేరకు ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఏపీపీఎస్సీ విజ్ఞప్తి చేసింది.

