‘వై కేటగిరీ’ సెక్యూరిటీతో ఫోజులు కొడుతున్న ఎమ్మెల్యే
తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనకు కేటాయించిన వై కేటగిరీ సెక్యూరిటీతో వీడియోరీల్స్ చేస్తూ మీడియాకు పోజులు కొడుతున్నారు. గతంలో మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫిర్యాదుదారుగా ఉన్న రోహిత్ రెడ్డికి వై కేటగిరీ రక్షణ కలిగించింది రాష్ట్రప్రభుత్వం. అయితే ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని తన సొంత మనుషులను వాడుకుంటున్నట్లు వాడుకుని వీడియోలు తీసుకుంటున్నారు రోహిత్ రెడ్డి. సెక్యూరిటీ సిబ్బంది అటూ ఇటూ నడుస్తూండగా తాను మధ్యలో రాజాలాగ నడుస్తుండగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనితో నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఇలా ప్రభుత్వ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. గత కొంత కాలంగా యాగం చేస్తున్న ఆయన ఆ సందర్భంలో పట్టువస్త్రాలతో ఇలా సెక్యూరిటీ సిబ్బందితో రీల్స్ తీసుకున్నారు.

