TDP అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు హడావిడి మొదలయిపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు నాయుడు కసరత్తులను మొదలుపెట్టారని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నేతల పనితీరుపై కన్నేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సర్వేలను చేయిస్తున్నారు. నియోజకవర్గాలలో స్థానిక ప్రజల నాడి, క్యాడర్‌కి అనుగుణంగా ఉన్న నేతలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో ఈ మేరకు మార్పులు చేర్పులు చేసిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా సర్వేలు నిర్వహిస్తూ నివేదికలను తయారు చేస్తున్నారు. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. గతంలో మాదిరిగా ఎటువంటి ఒత్తుడులకు, ఇతర అంశాలు కు ప్రభావితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ నేతలకు ఇదే అంశాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పనితీరు ఆధారంగా, నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఆధారంగా టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలలో నేతల ముందస్తుగానే పనిచేస్తే గెలుపు తధ్యమన్న ధీమాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అదినాయకత్వం ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. సర్వే రిపోర్ట్ లో పార్టీ వ్యూహ కర్తల నివేదికలను కూలంకషంగా పరిశీలిస్తూ అభ్యర్థుల వడ పోత కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

