Home Page SliderNational

విచిత్రంగా మాయం కాబోతున్న నీడలు

భూమిపై సరిగ్గా గమనించాలే కానీ ఎన్నో వింతలు, విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు సరిగ్గా మధ్యాహ్నం  12.17 గంటలకు భూమిపై మన నీడ మనకు కనిపించదు. ఈ రోజు భారత్‌లోని బెంగళూరులో సూర్యుని కిరణాలు నడినెత్తిన పడే సమయంలో నీడలు కనిపించకుండా పోతాయి. ఇలా ఏటా రెండుసార్లు జరుగుతుంది. ఇది ఏప్రిల్ 25, ఆగస్టు 18న ఇలా కొన్ని ప్రాంతాలలో జరుగుతూ ఉంటుంది. బెంగళూరులోని ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్‌లో ఈ విషయంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక పోల్‌ను నిలబెట్టి దాని నీడ మాయం అయ్యే సన్నివేశాన్ని విద్యార్థులకు లైవ్‌లో చూపించారు ఉపాధ్యాయులు. భూమధ్యరేఖా ప్రాంతంలో మాత్రమే ఇలాంటి అద్భుతం గోచరమవుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సరిగ్గా సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు ఇలా నీడ పూర్తిగా మాయం అవుతోంది. మామూలు రోజుల్లో కూడా మిట్టమధ్యాహ్నం వేళ నీడలు చిన్నవిగా కనిపిస్తాయి. కానీ ఇలా పూర్తిగా మాయమవడం విచిత్రంగానే ఉంది. పొద్దున్న పూట, సాయం సమయాలలో నీడలు పొడవుగా ఉండడం, మధ్యాహ్నసమయంలో పొట్టిగా ఉండడం కూడా మనం గమనిస్తూ ఉంటాం.