Andhra PradeshHome Page SliderNews Alert

టీడీపీలో చేరిన వైసీపీ నేత

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సోదురుడు, వైసీపీ నేత గిరిధర్‌ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గిరిధర్‌ రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2023లో 23వ తేదీన 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం దేవుడి అసలైన స్ర్కిప్ట్‌ అని అభివర్ణిచారు. దేవుడు స్క్రిప్ట్‌ తిరగ రాశాడన్నారు. వైసీపీ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్‌ రెడ్డి టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరారని పేర్కొన్నారు. గిరిధర్‌ రెడ్డితోపాటు కోవూరు, గూడూరు, నెల్లూరు రూరల్‌, నెల్లూరు సిటీ నియోజకవర్గాల వైసీపీ నేతలు, వందలాది మంది కార్యకర్తలు పసుపు కండువాలు కప్పుకున్నారని తెలిపారు. జగన్‌ పని అయిపోయిందన్నారు. గిరిధర్‌ రెడ్డి లాంటి సేవాభావం ఉన్న వారే జగన్‌ పార్టీలో ఉండలేకపోతే.. సామాన్య కార్యకర్తలు ఎలా ఉంటారు? అని ప్రశ్నించారు. జగన్‌ నమ్మిన వారిని నట్టేట ముంచే రకం. జగన్‌ మళ్లీ గెలవలేడని హితవు పలికారు.