రైలులో చైన్ స్నాచర్ హల్చల్..శిక్ష విధించిన రైల్వే కోర్టు
చైన్ స్నాచర్లు మొన్నటివరకు రోడ్ల మీద ఒంటరి ఆడవాళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు మాత్రం కాస్త రూటు మార్చి రైళ్లలో సహితం చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. ఈ విధంగా రైళ్లల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఓ నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడికి సికింద్రాబాద్ రైల్వే కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడిని కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిని సత్తెన్నగా పోలీసులు గుర్తించారు. ఇతను యశ్వంతాపూర్ రైలులో ఓ విద్యార్థిని మెడలో నుంచి బంగారు చైన్ లాక్కొని పారిపోయాడు. దీంతో ఆ విద్యార్థిని వెంటనే MBNR రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

