Home Page SliderTelangana

మెట్రో ధరల పెంచొద్దని వార్నింగ్ ఇచ్చాం-మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో మెట్రో టికెట్ ధరలను పెంచడాన్ని ఆమోదించేది లేదన్నారు మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు. ఇప్పటికే ధరల పెంపుపై మెట్రోను హెచ్చరించామన్నారు. మెట్రో చార్జీలు, ఆర్టీసీతో సమానంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో మెట్రో కొత్త పనులకు కేంద్రం మోకాలడ్డుతోందని కేటీఆర్ దుయ్యబట్టారు. దేశంలోని చిన్న చిన్న నగరాలకు మెట్రో రైళ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న కేంద్రం, హైదరాబాద్ మహానగరానికి మాత్రం మొండిచేయి చూపిస్తోందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రోను విస్తరించేందుకు మూడేళ్ల కార్యాచరణ పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని తెలుసన్న మంత్రి పాతబస్తీకి సైతం మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాజధానిలో నాలాల అభివృద్ధి కోసం రూ. 985 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.