Home Page SliderInternationalNews Alert

టార్గెట్‌ 145.. 45 పరుగులకే 4 వికెట్లు..

మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ కష్టాల్లో పడింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 45 పరుగలకే 4 వికెట్లు కోల్పోయింది. టీమిండియా టాపార్డర్‌ పూర్తిగా చేతులెత్తేసింది. కేఎల్‌ రాహులఉ (2) పరుగులు చేసి ఔటవ్వగా.. శుబ్‌మన్‌ గిల్‌ (7), పుజారా (6) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. కోహ్లీ 22 బంతులు ఆడి ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి   4 వికెట్ల నష్టానకి 41 పరుగులు చేసింది.  అక్షర్ పటేల్(26), ఉనద్కత్(3 నాటౌట్) అజేయంగా నిలిచారు. ఇప్పుడు విజయానికి 100 పరుగులు అవసరం. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు తీయగా, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారాలను ఔట్ చేశాడు. ఓపెనర్ షకీబ్ అల్ హసన్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔట్ చేశాడు. అంతకుముందు అక్షర్ పటేల్ రనౌట్ కావడంతో బంగ్లాదేశ్ 231 పరుగుల వద్ద ఆలౌటైంది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో లిటన్ దాస్ 73 పరుగులు చేయగా అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు.