Andhra PradeshHome Page SliderNews Alert

44 నిమిషాలకే 2.20 లక్షల టికెట్లు.. 27న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 27న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరపాలని టీటీడీ నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయనున్న టీటీడీ… ఈ నెల 27న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26న ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోబోమని… భక్తులు ఈ విషయం గమనించాలని పేర్కొంది.

మరోవైపు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేసిన 44 నిమిషాలకే 2 లక్షల 20 వేల టికెట్లు బుక్‌ అయ్యాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీవారి స్పెషల్‌ ఎంట్రీ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచింది. జనవరి 1 నుంచి 11 వరకు రోజుకు 20 వేల చొప్పున వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి పురష్కరించుకొని 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశారు.