జగన్ పుట్టినరోజు సంబరాలు.. 600 కిలోల భారీ కేక్‌ను కట్ చేసిన ఫ్యాన్స్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు అప్పుడే మిన్నంటుతున్నాయి. ఇప్పటికే రేపు జరిగే జగన్ పుట్టిన రోజు వేడుకలకు భారీ ఏర్పాట్లు సాగుతుండగా.. ఆ లోపే రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ అభిమానులు జగన్ బర్త్ డే సంబరాలు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో 600 కేజీల భారీ కేక్‌ను వైసీపీ నేతలు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

గొల్లపూడి వేదికగా జనం గుండెల్లో నిలిచిన అభిమాన నేత మన సీఎం జగనన్న జన్మదిన వేడుకలను వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఓ జాతరలా జరుపుకుంటున్నారని మంత్రి మేరుగ నాగార్జున ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమానికి భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు హాజరు కావడంతో జై జగన్ అనే నినాదాలతో గొల్లపూడి ప్రాంతం మార్మోగింది. మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో సచివాలయం-1 ఎదురుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

