ముఖంపై సూదులు గుచ్చుకున్న టాలీవుడ్ బ్యూటీ.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పీర్జాదా వరుస సినిమాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఆమె తొలి సినిమా ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ భారీ విజయంతో టాలీవుడ్లో పరిచయం అయింది. అప్పటి నుండి ఆమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. తాజాగా ఎఫ్2 మూవీతో భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే.. లేటెస్ట్గా మెహ్రీన్‌కు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ముఖం నిండా సూదులతో ఉన్న ఫోటోని మెహ్రీన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో మెహ్రీన్‌కు ఏమైందంటూ.. ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె ముఖంపై ఇలా సూదులు ఎందుకు గుచ్చారని వారు చర్చించుకుంటున్నారు. అయితే తాను ప్రస్తుతం ఆక్యుపంక్చర్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ ట్రీట్మెంట్ కారణంగా తన ముఖం కాంతివంతంగా మారుతుందని మెహ్రీన్ అంటోంది. అయితే ఏజ్‌బార్ అయిన మహిళలు ఎక్కువగా ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ 27 ఏళ్లకే మెహ్రీన్ ఎందుకు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటుందా అని అభిమానులు ప్రశ్నించుకుంటున్నారు.

