కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుపై నారా లోకేశ్‌కు ఊరట
టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో విజయవాడ మొదటి అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని తన పిటిషన్‌లో కోరారు. లోకేశ్ తరుపున సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలను వినిపించారు. వాదనలను విన్న హైకోర్టు కేసును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.