మంత్రి తలసాని సోదరులను విచారిస్తున్న ఈడీ
కొద్ది రోజులుగా ఈడీ, ఐటీ శాఖల అధికారులు తీవ్ర స్థాయిలో దాడులతో తెలంగాణ రాష్ట్రానికి చుట్టేస్తున్నారు. పలువురు టీఆర్‌ఎస్ నేతల నివాసాలు, కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్‌లను ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో విచారిస్తున్నారు. గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో అలజడి మొదలైంది.

