Andhra PradeshNews

సూపర్ స్టార్ కృష్ణకు అనారోగ్యం

అలనాటి టాప్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఎదుర్కోవడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్‌కు తీసుకొచ్చారు. ఐతే కృష్ణ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన బాగానే ఉన్నారని… 24 గంటల్లోనే డిశ్చార్జి చేయనున్నట్టు తెలుస్తోంది. కృష్ణ ఆరోగ్యం బాగానే ఉందన్నారు నటుడు నరేష్. ఇటీవల కృష్ణ భార్య ఇందిరాదేవి మృతితో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అనారోగ్యంతో మరణించారు. అంతకుముందే విజయ నిర్మల మరణించారు. నటుడి ఇంట్లో వరుస విషాదాలు చోటుచేసుకోవడంతో ఘట్టమనేని అభిమానులు ఆందోళన నెలకొంది.