టాస్ ఓడిన భారత్… ఫస్ట్ వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. భారత్ – ఇంగ్లండ్ జట్ల హోరాహోరీ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఇండియా జర్నీ ఇప్పటివరకు అద్భుతంగా కొనసాగింది. గత 5 మ్యాచ్‌లలో 4 గెలిచి నాకౌట్ రౌండ్‌కు చేరుకుంది. జోస్ బట్లర్ నేతృత్వంలో బలమైన ఇంగ్లండ్ జట్టుతో తలపడుతోంది. ఆడిలైడ్ మైదానం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రతి ఆటగాడి పాత్ర కీలకం కానుంది. అయితే.. ఇక్కడ సెంటిమెంట్ ట్విస్ట్ ఉంది. ఇక్కడ టాస్ ఓడిపోతేనే భారత్‌కు ఫైనల్‌కి చేరుకుంటుందట. ఇప్పటి వరకు అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. ఇక్కడ టాస్ గెలిచి మ్యాచ్ గెలవడం కష్టమే. ప్రస్తుతం భారత్ స్కోరు రెండు ఓవర్లలో 10 పరుగులు చేసి ఫస్ట్ వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ కేల్ రాహుల్ 5 పరుగులు చేసి ఔటయ్యాడు.