ఇండియా కోసం పాక్ వెయిటింగ్… షోయబ్ అక్తర్ దూకుడు
ఇంగ్లాండ్‌తో కాసేపట్లో సెమీ ఫైనల్స్ ఆడుతున్న భారత్ జట్టుపై పాకిస్తాన్ మాజీ పేసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో ఫైనల్స్ ఆడేందుకు తాము ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నామన్నారు. ఒక విజయం దేశం మొత్తం మూడ్‌ని మార్చగలదన్న అక్తర్… టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు వస్తే, సంబరాలు మిన్నంటాయన్నారు. పాకిస్థాన్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. గ్రూప్ 2లో రెండో స్థానంతో సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించిన జట్టు, ఇప్పుడు ఫైనల్‌లోకి ప్రవేశించిన మొదటి జట్టుకి కితాబిచ్చాడు. నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఫైనల్‌లో.. సెమీస్‌లో ఎవరు విజయం సాధిస్తే వారితో పాకిస్తాన్ తలపడనుంది.

మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ భారత్‌కు సందేశం ఇచ్చాడు. హిందూస్థాన్, మేము మెల్బోర్న్ చేరుకున్నామని… మీ కోసం పాకిస్తాన్ ఎదురు చూస్తోందన్నాడు. ఇంగ్లండ్‌ని ఓడించి మెల్‌బోర్న్‌కు చేరుకున్నందుకు ముందుగా శుభాకాంక్షలంటూ చెప్పుకొచ్చాడు. మెల్‌బోర్న్‌లో 1992 ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించామని… ఇప్పుడు 2022 వచ్చిందన్నాడు. సంఖ్యలు భిన్నమైనవే కానీ ఒకేలా ఉన్నాయన్నాడు. భారత్-పాకిస్థాన్ ఫైనల్ తనకు కావాలన్నాడు. మరోసారి ఆడదామన్న షోయబ్… మనకు మరో మ్యాచ్ కావాలన్నాడు. ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోందంటూ షోయబ్ అక్తర్ వీడియోను ట్వీట్ చేశాడు.

