NewsTelangana

కౌంటింగ్‌లో ఇబ్బంది లేదు

మునుగోడు ఎన్నికల కౌంటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ చెప్పారు. అభ్యర్థులు ఎక్కువ మంది ఉండటం వల్లే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని అబ్జర్వర్లు చెప్పారన్నారు. ప్రతి రౌండ్‌కు అరగంట కంటే ఎక్కువే పడుతోందన్నారు. ప్రతి టేబుల్‌ వద్ద పార్టీల ఏజెంట్లు ఉన్నారని గుర్తు చేశారు. ఆర్‌వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల ఫలితాలను మునుగోడుతో పోల్చలేమని చెప్పారు.