నవంబర్ 11న ప్రధాని మోదీ విశాఖ టూర్
నవంబర్ 11న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల పరంగా జరిగే మరికొన్ని కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో మోదీ బహిరంగ సభలో పాల్గొని పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కాలేజ్ గ్రౌండ్లో జరిగే సభ స్థలాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఏరాట్ల వివరాలను పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. 7 కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారని విజయసాయిరెడ్డి తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను ఎవరూ రాజకీయం చేయవద్దని విజయసాయి రెడ్డి కోరారు.

