మీ సేవకుడిగా ఉంటా: కూసుకుంట్ల
మీ సేవకుడిగా నిరంతరం అందుబాటులో ఉంటూ మునుగోడు అభివృద్ధికి పాటుపడతానని మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ‘నేను మునుగోడు మట్టి బిడ్డను. ఇక్కడే పుట్టాను. ఇక్కడే పోతాను. నాకు ఓటేసి గెలిపించాలని మునుగోడు ప్రజలకు పాదాభివందనాలు చేసి కోరుకుంటున్నారు’ కూసుకుంట్ల చెప్పారు.

