ఉపఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమిదే ముందంజ
దేశంలో వివిధ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 13 చోట్ల జరిగిన ఉపఎన్నికల లెక్కింపు నేడు మొదలయ్యింది. వీటిలో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. రెండు చోట్ల మాత్రమే ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 4, హిమాచల్ ప్రదేశ్‌లోని 3, ఉత్తరాఖండ్‌లో 2, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్, బిహార్‌లలో ఒక్కొక్క స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. తమిళనాడు డీఎంకే, హిమాచల్‌లో 2 స్థానాలలో, మధ్యప్రదేశ్‌లో 1, బీహార్‌లోని 2 స్థానాలలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. పంజాబ్‌లోని ఆప్ అభ్యర్థి గెలుపొందారు. హిమాచల్‌లోని ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.