టీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే.. బీజేపీకి షాక్
మునుగోడు, మనసర్కార్: ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్లోకి వెళ్లనున్నారు. ఆరు నెలల క్రితమే బీజేపీలో చేరిన ఆయన శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలోకి వెళ్లడంతో గౌడ వర్గీయులు టీఆర్ఎస్కు దూరం కాకుండా భిక్షమయ్య గౌడ్‌ను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత లాభం కోసమే మునుగోడు ఉప ఎన్నికను సృష్టించారని భిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. ఆయన ఏప్రిల్ 5వ తేదీన కాషాయ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకున్న విషయం తెలిసిందే.

