Andhra PradeshNews

సిగ్గు సిగ్గు.. పవన్ కల్యాణ్ నోటి వెంట ఇలాంటి మాటలా?

జనసేనాని చీఫ్ కల్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. సినిమాల్లో చూపించాల్సిన రుబాబు రాజకీయాల్లో చూపించడమేంటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదర్శాలు, నీతులు, సిద్ధాంతాల గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. విశాఖ ఘటన తర్వాత అమరావతి వచ్చిన పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయ్. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నాడు పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేతతోపాటు, కొంతమంది నేతలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలయ్యాక సీన్ మారిపోయింది. 2019లో బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రయాణించిన పవన్ కల్యాణ్, ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీతో అలయన్స్ కుదుర్చుకున్నారు. నాటి నుంచి వైసీపీ, జనసేన మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయ్. పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్నప్పటికీ తన మనసంతా చంద్రబాబే ఉన్నారంటూ వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అంటూ కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేస్తోన్నారు.

నిజమే పవన్ కల్యాణ్‌ను కొందరు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సాక్షాత్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి.. పొత్తుల గురించి మాట్లాడుతూ దత్తపుత్రుడు చంద్రబాబుతో కలిసిపోతున్నారని విమర్శలుగుప్పించారు. వాటిని విమర్శించడానికి మీకో వేదిక తప్పకుండా ఉంది. కానీ ఇలాంటి పరుషమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా సామాన్య జనంలో ఎలాంటి సందేశం తీసుకెళ్తున్నారన్న అపవాదు కలగదా? సినిమాకు వెళ్లకుండానే A సర్టిఫికేట్ మూవీ ఫ్రీగా చూసినట్టుగా అన్పించిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. తొలుత వైసీపీ నేతల అనండి.. పడతానంటూ మాట్లాడారు. ప్రజల్లోనే అన్నీ తేల్చుకుంటానన్నారు పవన్ కల్యాణ్… ఆ తర్వాత వాళ్లు ఒకటంటే.. నేను రెండంటానంటూ మాటలు లంఖించింకున్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువల గురించి మాట్లాడే పవన్ తొలుత తీవ్ర వ్యాఖ్యలు ఏమీ చేయకున్నప్పటికీ తర్వాత తర్వాత.. వైసీపీ నేతల తరహాలో కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా సాగుతున్న తరుణంలో విశాఖ జనవాణి కార్యక్రమం రద్దు కావడం, అందుకు వైసీపీ నేతలే కారణమని భావించిన పవన్ కల్యాణ్… దూకుడు పెంచారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించాలని చూస్తే.. హోటల్ గది నుంచి సైతం బయటకు రానివ్వకుండా చేశారంటూ మండిపడ్డారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతోపాటు, 9 మంది కార్యకర్తలపై తీవ్ర అభియోగాలు నమోదు చేయడంతో పవన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

రాజ్యాంగం, భావ ప్రకటన స్వేచ్ఛ అన్న స్ఫూర్తికి జగన్ సర్కారు విరుద్ధంగా నడుస్తోందంటూ దుయ్యబట్టారు. వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి కొందరు నేతలను తాను అనడం లేదని.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నేతలకు ఇవన్నీ వర్తిస్తాయంటూ బూతుపురాణం లంఖించుకున్నారు. ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శిస్తే ఇక ఊరుకోనన్నారు. చెప్పు తీసుకొని కొడతా… ఒక్కొక్క వైసీపీ కొడకల్లారా అంటూ దుయ్యబట్టారు. ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే… చెప్పు చూపించి మరీ కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం నా సహనం మిమ్మల్ని కాపాడిందంటూ రెచ్చిపోయారు. ఎదవల్లారా.. సన్నాసుల్లారా.. చవటల్లారా.. దద్దమ్మల్లారా.. నా సహనం ఇన్నాళ్లూ మిమ్మల్ని రక్షిస్తుందంటూ దండకం మొదలుపెట్టారు. వైసీపీ గూండాగాళ్లారా… మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా.. మీ దగ్గర రౌడీలున్నారా.. ఒంటి చెత్తే మెడ పిసికేస్తా… ప్యాకేజీ అంటూ ఎవరైనా కామెంట్లు చేస్తే దవడ వాసిపోయేలా కొడతనంటూ చెలరేగిపోయారు.

అంతటితో ఆగలేదు… ఇళ్లల్లో ఉన్నోళ్లను చొక్కపట్టుకొని బయటకు లాక్కొచ్చి మరీ కొడతానంటూ హెచ్చరించారు. సభ్యత సంస్కారమని మూసుకు కూర్చున్నాం… కానీ శిక్షా ధర్మమే పనిచేస్తుందన్నారు. నుంచో బెట్టి తోలు వలుస్తా కొడకల్లారా అంటూ చెలరేగిపోయారు. సై ఈ రోజు నుంచి… కొడకల్లారా… మీరు యుద్ధం చెప్పండ్రా.. మీరు చెప్పండ్రా… రాడ్లా, హాకీ స్టిక్కులు, రాళ్లా, ఒట్టి చేతులా దేనికైనా రెడీ.. మీరు రండి.. ఎంత మంది వైసీపీ గూండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో.. చాలెంజ్ చేస్తానంటూ కామెంట్ చేశారు. మా ఆడబిడ్డ వినూత మీద చెయ్యేస్తార్రా కొడకల్లారా.. భాష రాదనుకున్నారా.. నేను లండన్, న్యూయార్క్‌లో పెరగాననుకుంటున్నారా ఎదవల్లారా… పుట్టింది పెరిగింది పక్కన ఉన్న బాపట్లలో.. ఏదో సన్నగా ఉంటాం.. నీరసంగా ఉంటాం.. సినిమాల్లో యాక్ట్ చేస్తామనుకుంటే ఎలా… సున్నితంగా ఉంటామనుకుంటే ఎలారా ఎదవల్లారా అంటూ ఇక అనరాని మాటలన్నీ అనేశారు. వాస్తవానికి తెల్లారి లేస్తే ఆయన ఉండేది హైదరాబాద్‌లోనని… సినిమాల్లో షూటింగ్ తరహాలో ఏపీలో ప్రచారానికి వస్తారంటూ గత కొంతకాలంగా వైసీపీ నేతలు విమర్శిస్తూ వచ్చారు. తాను 3 పెళ్లిళ్లు చేసుకుంటే… వాళ్లు 30 స్టెపినీలతో తిరుగుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయ్… కుదరకుంటే డబ్బులిచ్చేసి విడాకులిచ్చేస్తారా.. అని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.

ప్రజల కోసం రాజకీయాలు చేస్తానని చెప్పే నాయకులు ఇలాంటి మాటలా మాట్లాడేదా… సిగ్గు సిగ్గు అంటూ సమాజం నిస్సహాయస్థితిలో కూరుకుపోయింది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ రాజకీయాలను అభిమానించిన న్యూట్రల్ జనాలు తలలుపట్టుకుంటున్నారు. కొడాలి నానికి, పేర్ని నానికి, పవన్ కల్యాణ్‌కు పెద్ద తేడా ఏముందంటూ తేల్చేస్తున్నారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన సహనంలో పవన్ కల్యాణ్‌కు ఇసుమంత కూడా లేదంటూ మండిపడుతున్నారు. నిజాయితీ విషయంలో ఎవరి సర్టిఫికెట్లు పవన్ కల్యాణ్‌కు అక్కర్లేదు. ఆయన సంపాదించిన దాంట్లో ఎందరికో దానధర్మాలు చేస్తుంటారు. అలాగని… ఇష్టారాజ్యాంగా రాజకీయాలు మాట్లాడతానంటే ఎలా కుదురుతుంది. రాజకీయమంటేనే అనైతిక చర్యలకు పాల్పడటమన్న సూక్తి ముక్తావళి ఇప్పుడు తెలుగు నేలలో గంగా జలంలా పారుతోంది. ఈ తిట్ల పురాణం ఇక్కడితో ఆగనే ఆగదు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులంతా అదే స్పీడ్‌తో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇవాళ రేపు మిగిలినవాళ్లు కూడా కామెంట్స్ చేస్తారు… 30 ఏళ్లు రాజకీయం చేయాలి.. సుదీర్ఘ కాలం రాజకీయం చేసి.. ప్రజల అభిమానం చూరగొనాలనుకునే మీరు… ఇలాంటి భాష వాడొచ్చా… నోటి దుల అవసరమా.. నోటికి ఎంతోస్తే అంతలా మాట్లాడతారా… ఇదేమైనా సినిమా షూటింగ్ అనుకున్నారా ఏంటి?