Telangana

మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం..

మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు మొత్తం 100 పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తరుపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ గౌడ్‌లు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంది. రేపటి నుంచి అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్, 6న కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల ఎపిసోడ్ ముగియడంతో పార్టీల ప్రచార పర్వం జోరందుకోనుంది