వెంకట్ రెడ్డిని బండబూతులు తిట్టిన అద్దంకి దయాకర్
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి దారుణంగా అవమానించారు కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్… మునుగోడులో కాంగ్రెస్ పార్టీ సభ పెడితే… ఢిల్లీలో ఏం పనంటూ ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతుంటే… ఢిల్లీలో మోదీ, షా వద్ద మోకరిల్లుతావా అంటూ నిప్పులు చెరిగారు. ఉంటే ఉండు లేకుంటే దెం.. (వినలేని పదం) అంటూ బూతులు తిట్టారు. అటు కమలం… ఇటు గులాబీ… రెండు పార్టీలున్నాయని… మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉందని… వెంకట్ రెడ్డి ఏ గట్టునుంటాడో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్‌కు విలువ నిచ్చి… ఆస్తులిస్తే… ఇప్పుడు ద్రోహం చేస్తారా అంటూ ప్రశ్నించారు. బ్రదర్స్ ఇద్దరినీ… కాంగ్రెస్ పార్టీ ఎంపీలను చేసి… 30 వేల కోట్ల రూపాయల ఆస్తులిస్తే… మునుగోడు ప్రజల వైపు ఉండాలా… దొంగ మోదీ వైపు ఉండాలో తేల్చుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే… ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని… ఈ ప్రాంతంలో లేకుండా మోదీ చేస్తుంటే… ఆ ప్రయత్నాలకు రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి వంత పలుకుతున్నాడంటూ దుయ్యబట్టారు. అందుకే రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో బొంద పెట్టాలన్నారు దయాకర్. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలకు రేవంత్ ఎందుకు టార్గెట్ అయ్యారో ప్రజలు గమనించాలన్నారు. రేవంత్ ప్రజల కోసం పనిచేస్తుంటే కొందరు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో బయట నుంచి వచ్చినవాళ్లేం చేయలేరని… గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనన్న దయాకర్… కేసీఆర్ 25 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో చిక్కుకున్నాడని… ఐనా మోదీ, అమిత్ షా ఎందుకు విచారణ జరిపించడం లేదన్నారు. కేసుల భయంతో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి… మునుగోడులో బీజేపీని గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడని ఆక్షేపించారు.