NationalNews Alert

DCB బ్యాంకు అదిరిపోయే ఆఫర్

డీసీబీ బ్యాంకు వినియోగదారులకు కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇది సురక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్. ఈ స్కీమ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఆందోళన అవసరం లేదు. మనం డిపాజిట్ చేసిన మొత్తానికి 10 లక్షల రూపాయల వరకూ ఉచిత బీమా కవరేజి ఇస్తోంది. దీనికోసం ప్రీమియం కస్టమర్లు చెల్లించనక్కరలేదు. అంతే కాకుండా ఏ రకమైన వైద్యపరీక్షలు అవసరం లేకుండానే ఈ భీమాను వర్తింపజేయనున్నారు. మూడు సంవత్సరాల డిపాజిట్లపై 7.10 శాతం అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నారు. ఈ అవకాశాలను ఖాతాదారులు వినియోగించుకోవల్సిందిగా కోరుతున్నారు. డీసీబీ NRI లకు కూడా సురక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్లను, ఆకర్షనీయమైన వడ్డీరేట్లను, ఉచిత బీమా సౌకర్యాలను కల్పిస్తోంది.