నేడు పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ
షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ 22వ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఉజ్బెకిస్తాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పుతిన్‌తో, వర్తక వాణిజ్యంతోపాటు, భౌగోళిక రాజకీయ అంశాలపైనా మోదీ చర్చించనున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం తర్వాత రెండేళ్ల తర్వాత జరుగుతున్న సమావేశంలో ఆయా దేశాలతో వన్ టు వన్ భేటీ అయ్యేందుకు ఇది చక్కటి అవకాశంగా భావిస్తున్నారు.

ఈ శిఖరాగ్ర సమావేశంలో 8 దేశాల అధినేతలు భాగస్వాములవుతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటున్నారని… ఆయన ప్రధాని మోదీతో సహా పలు దేశాల అగ్రనేతలతో భేటీ అవుతారని రష్యా రాయబారి ఇండియా డెనిస్ అలిపోవ్ ANI కి చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీతో, అధ్యక్షుడు పుతిన్ అనేక అంశాలపై మాట్లాడటంతోపాటు, మద్దతు కోరతారన్న చర్చలు జరగనున్నాయి.

ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలపై ఇరుదేశాధినేతలు మాట్లాడుకోనున్నారు. యుద్ధం తర్వాత రష్యా నుంచి ఇండియ చమురు కొనుగోలుపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసింది. ఈ తరుణంలో ఇండియా సైతం ప్రపంచదేశాలకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇండియా 90 శాతం చమురు దిగుమతులు చేసుకుంటుందని… అనవసరమైన సమస్యలు సృష్టించవద్దని విదేశాంగ శాఖ ఆయా దేశాలను కోరింది. వచ్చే డిసెంబర్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా సమావేశానికి ఈసారి ఇండియా ప్రతినిధ్యం వహించనుంది. అదే సమయంలో ఈసారి జరిగే షాంగై కోపరేషన్ సదస్సుకు ఇండియాలో జరగనుంది. జీ 20 సమావేశానికి సైతం భారత్ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో అధ్యక్షుడు పుతిన్ చర్చలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకోనున్నాయ్.

2021 డిసెంబర్లో ప్రెసిడెంట్ పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలును జూలైలో ఇరువురు నేతలు పరస్పరం మాట్లాడుకున్నారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఫిబ్రవరి 24న PM మోడీ మరియు Mr పుతిన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉజ్బెకిస్తాన్ సమర్‌కండ్‌కు బయలుదేరి ముందు ఎస్సిఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్నానని… విస్తృతమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల పరస్పరం షేరే చ్సుకుంటామని చెప్పారు. 2019లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో …. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్లతో కూడిన ఎనిమిది మంది సభ్యుల ఆర్థిక మరియు భద్రతా కూటమి సమావేశమైంది.

