మోదీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
భారత ప్రధాని మోదీపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని మోదీకి పడుతుందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలు నచ్చక బంగ్లాదేశ్ తరహాలోనే ప్రజలు తిరుగుబాటుకు దిగుతారని, ఏదో ఒకరోజు ప్రధాని మోదీ ఇంటిపై దాడి చేస్తారని వ్యాఖ్యానించారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఇలాంటి సంఘటనలు చూశామన్నారు. ఈ సారి భారత్‌లో కూడా కేంద్రప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్నారు.