NationalNews

నుపుర్‌ శర్మకే నా మద్దతు

మహ్మద్‌ ప్రవక్తపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన బహిష్కృత బీజేపీ నేత నుపుర్‌ శర్మపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్‌ థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. నుపుర్‌ శర్మకు తాను బేషరతుగా మద్దతు ఇస్తున్నానని రాజ్‌ థాకరే అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వంటి నేతలు హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని, వారిని వదిలేసి నుపుర్‌ శర్మను అందరూ క్షమాపణలు అడగడం సమంజసం కాదని రాజ్‌ థాకరే అన్నారు.

మరో వైపు… ఉద్ధవ్‌ థాకరే గురించి మాట్లాడుతూ.. “నేను శివసేనలో ఉన్నప్పుడు బాలాసాహేబ్‌ ఎలా వ్యవహరించేవారో నాకు తెలుసు. ఏ పార్టీ వద్ద ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వారికే సీఎం కుర్చీని అప్పగించేవారు. మరి ఇలాంటి విధానం ఇప్పుడెలా మారింది? ఎన్నికల ప్రచారంలో కూడా ఫడ్నవీస్‌ సీఎం అవుతారని మోదీ, అమిత్‌ షా స్పష్టంగానే చెప్పారు. అప్పుడు లేని అభ్యంతరం ఎన్నికలు ముగిశాక ఎలా వచ్చింది?’’ అని థాకరే ప్రశ్నించారు.