రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టులు చేయిస్తున్నారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర లేకపోతే ఎందుకు అంతగా భయపడుతున్నారని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ జరిగిన వెంటనే.. ఎంపీ త్రివేది ఢిల్లీలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్‌తో కవిత హస్తంపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తు సంస్థల విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. దోషులను వదిలే ప్రసక్తే లేదని ఎంపీ సుధాన్షు త్రివేది హెచ్చరించారు.

