జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రూ.500 కోట్ల బెట్టింగ్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఉప ఎన్నికపై రాజకీయ ఉత్కంఠతో పాటు పందేల ఉత్సాహం కూడా చెలరేగింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు రెండో స్థానంలో నిలుస్తారు, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది అనే అంశాలపై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు సాగుతున్నాయట.
తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు రూ.500 కోట్ల వరకు పందేలు కాసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి ఈ మొత్తం రూ.1,000 కోట్లకు చేరవచ్చని అంచనా.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం 30 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థికే విజయావకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయ వేడి, బెట్టింగ్ జోష్ రెండూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

