కన్నీరు పెట్టిస్తున్న యాంకర్ స్వేచ్ఛ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
హైదరాబాద్‌లో ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆమె రామ్‌నగర్‌లో తల్లితో కలిసి నివసిస్తూ, తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆమె మరణానికి కొన్ని గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ధ్యానం చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ, ‘‘మనస్సు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది’’ అనే బుద్ధుడి కోటేషన్‌ను పోస్ట్ చేశారు. ప్రాధమిక దర్యాప్తులో కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు, కానీ మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.స్వేచ్ఛ టెలివిజన్ రంగంలో ఎంతో ఉత్సాహంగా పని చేశారు. ఆమె TUWJ (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) స్టేట్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఆమె ఆత్మహత్యపై తోటి యాంకర్లు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ దేవి, ఊహ తదితరులు భావోద్వేగంగా సోషల్ మీడియాలో స్పందించారు.

