Home Page SliderLifestylemoviesNationalNews Alertviral

ఆరాధ్యపై నెటిజన్ల ట్రోల్స్..మండిపడ్డ ఐశ్వర్యరాయ్..

బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల గారాలపట్టి 13 ఏళ్ల ఆరాధ్య బచ్చన్‌ను కూడా ట్రోలర్స్ విడిచిపెట్టడం లేదు. తాజాగా ఆరాధ్యకు ఐశ్వర్యరాయ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల తన తల్లి ఐశ్వర్యతో కలిసి ఈవెంట్లకు, ఫంక్షన్లకు హాజరవుతోంది ఆరాధ్య. దీనితో సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. అందంగా కనిపించడానికి 13 ఏళ్ల చిన్నపిల్లకి ప్లాస్టిక్ సర్జరీ చేయించారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువవడంతో ఐశ్వర్య మండిపడుతోంది. ఇటీవల కేన్స్‌ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ తెల్లని బెనారస్ చీర ధరించి, పాపిడలో సింధూరంతో ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ధీరూబాయ్ అంబానీ స్కూల్‌లో చదువుతున్న ఆరాధ్య ప్రతీ కార్యక్రమంలోనూ చాలా చురుగ్గా పాల్గొంటుంది.