Andhra Pradeshhome page sliderHome Page Slider

రౌడీషీటర్‌పై దాడి

ఏపీలోని తిరుపతిలో రౌడీషీటర్‌ పప్పు రాయల్‌పై యువకులు దాడికి పాల్పడ్డారు. క్రికెట్‌ ఆడుతున్న యువకులపై మత్తులో పప్పు రాయల్‌ గొడవకు దిగాడు. మద్యం తాగాలి.. వెళ్లిపొమ్మంటూ యువతను పప్పురాయల్ బెదిరించాడు. వెళ్లకపోతే దాడి చేస్తానంటూ అనుచరులతో కలిసి హెచ్చరించాడు. మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. వాగ్వాదం తీవ్రమై పప్పు రాయల్‌పై యువకులు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.